
యూజర్ల ప్రైవసీ కోసం ట్విటర్ కొన్ని కొత్త ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది. అందులో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, ఇతర అప్‌డేట్‌లతో సహా కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇక నుంచి ట్విట్టర్ మెసేజ్‌లు మరింత సేఫ్. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యాప్‌ల కోసం మెరుగైన డైరెక్ట్ మెసేజింగ్ (DMs), ఎన్‌క్రిప్షన్ ఆప్షన్లను ట్విటర్ తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో ట్విటర్ తమ ప్లాట్‌ఫామ్‌కు ఫోన్ కాల్స్‌ను యాడ్ చేసే పనిలో ఉందట. యాప్ లేటెస్ట్ వెర్షన్‌తో, థ్రెడ్‌లోని ఏదైనా మెసేజ్ DM రిప్లై ఇవ్వవచ్చు. ఏదైనా ఎమోజి రియాక్షన్ వాడొచ్చు. ఎన్‌క్రిప్టెడ్ DM V1.0 రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ ఫీచర్ వేగంగా డెవలప్ అవుతోంది.
వాయిస్, వీడియో కాల్స్
ట్విటర్ ప్లాట్‌ఫామ్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ఫేస్‌టైమ్ మాదిరిగానే ఉంటుంది. యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే ట్విట్టర్‌లో ఎవరికైనా కాల్ చేయొచ్చు. ఇప్పటికే ట్విటర్ స్పేస్‌ల ద్వారా లైవ్ వాయిస్ చాట్‌ని అందిస్తోంది. అయినప్పటికీ, స్పేస్‌లు పబ్లిక్, గ్రూపు చాట్‌ల కోసమే రూపొందించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రైవేట్, పర్సనల్ కాల్‌లను చేసుకోవచ్చు.