ట్వీట్స్‌ చూడాలంటే లాగిన్‌ కావాల్సిందే.. ట్విట్టర్ కొత్త రూల్

ట్వీట్స్‌ చూడాలంటే లాగిన్‌ కావాల్సిందే.. ట్విట్టర్ కొత్త రూల్

ట్విట్టర్ లోని ట్వీట్లను వీక్షించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అకౌంట్ ను కలిగి ఉండాలట. ఈ చర్యను ఆ కంపెనీ యజమాని ఎలోన్ మస్క్ తాత్కాలిక అత్యవసర చర్య అని అభివర్ణించారు. ట్విట్టర్ లో కంటెంట్‌ను వీక్షించడానికి ప్రయత్నించే యూజర్స్ ట్వీట్‌లను చూడటానికి అకౌంట్ ను సైన్ అప్ చేయమని లేదా యాప్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఖాతాను లాగిన్ అవ్వమని చూపిస్తుందనే కండిషన్ ను కొత్తగా జోడించారు. మొన్నటివరకు ట్విటర్‌లో లాగిన్ కాకపోయినా ట్వీట్లు కనిపించేవి. కానీ ఇక నుంచి ట్వీట్లు చూడాలంటే లాగిన్ కావాల్సిందేనన్నమాట.

ఇంతకుమునుపు ట్విట్టర్ లో ఎవరి ట్వీట్ నైనా చూడాలంటే లాగిన్ లేకపోయినా కనిపించేవి. గూగుల్ నుంచి సెర్చ్ చేసిన వారి ట్వీట్లు కనిపించేవి. దీని వల్ల చాలా మంది ట్విట్టర్‌ కంటెంట్‌ని దోచుకుంటున్నారని మస్క్ ఆరోపిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్‌లు ట్విట్టర్‌ నుంచి సమాచారాన్ని ఎక్కువగా సేకరిస్తున్నాయని మస్క్‌ చెబుతున్నారు. ఫలితంగా రెగ్యులర్ యూజర్లకు అందించే సేవలకు విఘాతం కలుగుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అందుకే లాగిన్ లేదా సైన్ అప్‌ని తప్పనిసరి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ చర్యను ‘తప్పనిసరి తాత్కాలిక చర్య’(Emergency Temporary Measure)గా ఆయన చెప్పుకొచ్చారు.