
ట్విట్టర్లో కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఇమ్మర్సివ్ మీడియా వ్యూయర్ యూజర్ల కోసం ఇమ్మర్సివ్ వ్యూయింగ్, ఈజీ డిస్కవరీ అనే రెండు ఫీచర్లు తెచ్చింది ట్విట్టర్. దీంతో ఇకపై వీళ్లు ఒక్క క్లిక్‌తో వీడియోల్ని ఫుల్ స్క్రీన్ మోడ్‌లో చూడొచ్చు. అంతేకాదు ఫుల్ స్క్రీన్ మోడ్ అయ్యాక అందులో ట్రెండింగ్ వీడియోల్ని కూడా సెర్చ్ చేయొచ్చు. యూజర్లకు ఇష్టమైన, వాళ్లు ఎక్కువగా చూసే కంటెంట్ వీడియోలు ఇందులో కనిపిస్తాయి. దాంతో ఎప్పటి కప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇమ్మర్సివ్ వ్యూయర్ నుంచి బయటకి రావడానికి ఎడమ వైపున కనిపించే ‘బ్యాక్’ బటన్ నొక్కాలి.