భారత్ కు సారీ చెప్పిన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌

భారత్ కు సారీ చెప్పిన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌

లడఖ్‌‌‌‌ను చైనాలో చూపినందుకని ఎంపీ మీనాక్షి లేఖి వెల్లడి

న్యూఢిల్లీ: లడఖ్‌‌‌‌ను చైనాలో చూపించిన అంశంపై ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ మన దేశానికి సారీ చెప్పింది. ఈ నెల 30 నాటికి తప్పును సరిదిద్దుకుంటామని పార్లమెంటరీ ప్యానల్‌‌‌‌కు వివరించిందని ఎంపీ, ప్యానల్‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ మీనాక్షి లేఖి అన్నారు. ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పిందని ఆమె చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ ఐఎన్‌‌‌‌సీ చీఫ్‌‌‌‌ ప్రైవసీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ డమైన్‌‌‌‌ కరియన్‌‌‌‌ అఫిడవిట్‌‌‌‌ రూపంలో క్షమాపణలు పంపారు. “ఇండియన్ల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు. ఈ నెల 30 నాటికి తప్పును సవరించుకుంటాం” అని దాంట్లో చెప్పారు. లడఖ్‌‌‌‌ చైనాలో భాగం అంటూ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ చూపించడంపై పార్లమెంటరీ ప్యానెల్‌‌‌‌ గతంలో ట్విట్టర్‌‌‌‌‌‌‌‌కు వార్నింగ్‌‌‌‌ ఇచ్చింది. దానిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ ఐఎన్‌‌‌‌సీ సభ్యులను దాదాపు రెండు గంటల పాటు విచారించింది.

Read more news

షుగర్ ఉంటే తేనె వాడొచ్చా..?

కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ

ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై

కరోనా టెస్ట్.. జస్ట్ రూ.850

పేకాటలో టెక్నాలజీ.. తండ్రీ కొడుకుల ఛీటింగ్