ఎలన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ట్విట్టర్ లోగో పక్షిని మార్చి దాని స్థానంలో డాగీని కొత్త లోగోగా మార్చారు. ఏప్రిల్ 1 నుంచి వెరిఫై అయిన ఖాతాలకు బ్లూటిక్ తొలిగించాలని హెచ్చరించారు. దీంతో ట్విట్టర్ అకౌంట్ 4.2 లక్షల మంది వెరిఫైడ్ ఖాతాలను అన్‌ఫాలో అయింది. ఏప్రిల్ 1 నుండి అన్ని లెగసీ వెరిఫైడ్ ఖాతాలను మూసివేస్తామని, ఇప్పటికీ వాటిని కలిగి ఉన్న వారికి చెక్‌మార్క్‌లను తీసివేస్తామని ట్విటర్ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది,
