గంట తేడాలో.. ఇద్దరు దోస్తుల సూసైడ్

గంట తేడాలో.. ఇద్దరు దోస్తుల సూసైడ్

పుణె : వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకే చోట పెరిగారు. ఏమైందో తెలియదు గానీ, కుటుంబాలతో కలిసి ఒకే బిల్డింగ్​లో నివాసం ఉంటున్న ఆ 19 ఏండ్ల యువతులు గంట తేడాలోనే సూసైడ్ చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ విషాదం చోటుచేసుకుంది. వాళ్లలో ఒకరు కామర్స్ విద్యార్థికాగా, ఇంకొకరు యానిమేషన్​ కోర్సు చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం  ఓ యువతి బెడ్​రూమ్​లో శవమై కనిపించింది. డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం తరలిస్తుండగా.. 7.30 ప్రాంతంలో అదే బిల్డింగ్​పై నుంచి దూకి ఆమె స్నేహితురాలు ప్రాణం తీసుకుంది. హదప్సన్​ ఏరియాలో జరిగిన ఈ ఘటనలకు కారణమేంటనేది తెలియరాలేదని, విచారణకు ఆదేశించామని పోలీసులు చెప్పారు.