
అందం, నటనలతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్స్ కేతిక శర్మ( Kethika Sharma), ప్రియా వారియర్(Priya Varrier) లు. ఈ ఇరువురు భామలకు సరైన హిట్ రాక చాలా కాలం అవుతుంది. కేతిక ఇప్పటికే తెలుగులో మూడు సినిమాలు చేసింది. అయినా ఒక్క సూపర్ హిట్ అందుకో లేకపోయింది.
ఇక ప్రియా వారియర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె తెలుగులో నితిన్‌తో చెక్, తేజ సజ్జతో ఇష్క్ అనే చిత్రాల్లో నటించింది. ఇవి రెండు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను నమోదు చేయకపోవడంతో మళ్లీ అవకాశాలు రావడానికి చాలా కాలమే పట్టింది.
ఇప్పుడు ఈ ఇద్దరు కథనాయికలు వారి అదృష్టాన్ని బ్రో సినిమాతో పరీక్షించుకోనున్నారు. సుప్రీమ్‌హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగాకనిపించనున్నారు. వీరు క్రియేట్ చేసే మ్యాజిక్ తోనే ఆ ఇద్దరి భామల భవిష్యత్ ఆధారపడి ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.