5వ క్లాస్ చదువుతున్న ఇద్దరు మగపిల్లలకు పెళ్లి..ఇదెక్కడి ఆచారమండి బాబూ

5వ క్లాస్ చదువుతున్న ఇద్దరు మగపిల్లలకు పెళ్లి..ఇదెక్కడి ఆచారమండి బాబూ

కర్ణాటకలో ఇద్దరు మైనర్లకు వివాహం జరిగింది. రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు మగపిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, రెండు గ్రామాల ప్రజలు  అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ మగపిల్లల పెళ్లి జరిపించారు.  వీరి వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏం చదువుతున్నారో తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే. అసలు ఇద్దరు మగపిల్లలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు...?  కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎందుకు పెళ్లి చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం..

ఎక్కడ జరిగిందంటే..

కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకాలలోని హిరేకట్టిగేహళ్లి గ్రామానికి చెందిన ఓ అబ్బాయికి, చిక్కబల్లాపూర్ తాలూకాలోని మొగలకుప్పే గ్రామానికి చెందిన మరో అబ్బాయికి ఈ వివాహం జరిగింది. వీరిద్దరు 5వ తరగతి చదువుతున్నారు. ఈ వివాహం హిరెకట్టిగేహళ్లిలో ఘనంగా జరిగింది.  బాజా భజంత్రీలు, వేదపండిత మంత్రొచ్చరణల మధ్య ఈ ఇద్దరు మగపిల్లల వివాహం వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, రెండు గ్రామాల ప్రజలు చూస్తుండగా..ఓ పిల్లాడు.మరో పిల్లాడి మెడలో తాళి కట్టాడు. పెళ్లి చేసుకున్న ఈ మగపిల్లలకు రూ. 1600 చొప్పున బహుమతులు అందించారు. 

మగపిల్లలకు పెళ్లి ..కారణం ఇదే

కర్ణాటకలో ఈ ఏడాది వానలు సరిగా కురవడం లేదు. అక్కడి గ్రామాల్లో వానలు లేక కరువు తాండవిస్తోంది. ముఖ్యంగా చింతామని, చిక్కబల్లాపూర్ మండలాల్లో చుక్క వాన లేక..పంటలు ఎండిపోతున్నాయి. చెరువులు, వాగుల్లో నీరు కరువై పశుగ్రాసం, పశువులకు నీళ్లు కరువయ్యాయి. ప్రజలకు మంచినీటికి కూడా కొరత ఏర్పడింది. ఈ క్రమంలో  రెండు గ్రామాల ప్రజలు వినూత్నంగా ఇద్దరు మగపిల్లలకు పెళ్లిచేసి వరుణ దేవుడికి పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించాలని వేడుకున్నారు. కళ్యాణోత్సవం తర్వాత వానదేవుడికి హారతులు పట్టారు. కురుణించు వరుణ దేవా అంటూ ప్రార్థించారు. 

ఇలా పెళ్లి చేస్తే వానలు పడతాయా...?

అబ్బాయిలకు పెళ్లి చేస్తే వానలు పడతాయని కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల ప్రజలు నమ్ముతారు. వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతీ ఏడాది కర్నాటకలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. మగ పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వానలు పడిన సందర్భాలు అనేకం. అందుకే అక్కడి ప్రజలు కరువు సమయంలో ఇలా పెళ్లి చేస్తారని స్థానికులు తెలిపారు. మగ పిల్లలకు ఘనంగా వివాహం జరిపి..పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్తులంతా విందులో పాల్గొంటారు.