టీ- –హబ్లో రెండు రోజుల పాటు సేఫ్‌‌‌‌ప్లాస్ట్-2025 సదస్సు.. మరిన్ని బిజినెస్ బైట్స్

టీ- –హబ్లో రెండు రోజుల పాటు సేఫ్‌‌‌‌ప్లాస్ట్-2025 సదస్సు.. మరిన్ని బిజినెస్ బైట్స్

హైదరాబాద్‌‌‌‌లోని టీ- –హబ్​లో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు సేఫ్‌‌‌‌ప్లాస్ట్-2025 సదస్సు జరుగుతోంది. ప్లాస్టిక్, కాస్మెటిక్, ఈస్థెటిక్ సర్జరీలలో రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. దేశవిదేశాల నుంచి వచ్చిన 145 మందికి పైగా ప్లాస్టిక్ సర్జన్లు, డెర్మటాలజిస్టులు , ప్లాస్టిక్ సర్జన్లు తమ అనుభవాలను పంచుకున్నారు.   ప్లాస్టిక్ సర్జరీలు చాలా సున్నితమైనవని, సరైన శిక్షణ లేకుండా కేవలం పుస్తకాలు చూసి చేయడం సరికాదని సూచించారు. 

SLG హాస్పిటల్, అజింక్యా డివై పాటిల్ హెల్త్ కేర్ మధ్య ఒప్పందం

హైదరాబాద్‌‌‌‌లోని నిర్మిస్తున్న 800 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహణ కోసం ఎస్.ఎల్.జి హాస్పిటల్స్,  అజింక్యా డి.వై. పాటిల్ హెల్త్‌‌‌‌కేర్ మధ్య ఒప్పందం కుదిరింది.  త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఆసుపత్రిని సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ భాగస్వామ్యం సరసమైన ధరల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ  అత్యవసర సేవలకు ప్రాధాన్యంఉంటుందని ఇవి తెలిపాయి.

ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ల సేవలను ప్రారంభించిన టైడ్

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్​ఎంఈల) కోసం బిజినెస్​ మేనేజ్​మెంట్​ ప్లాట్‌‌‌‌ఫామ్ టైడ్ తమ యాప్‌‌‌‌లో ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ల (ఎఫ్​డీ) సేవలను ప్రారంభించింది. దీనిద్వారా చిన్న వ్యాపారాలు తమ డబ్బుకు  ఏడాదికి 8.84 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. కనీసం పెట్టుబడి రూ.వెయ్యి. ఏడు రోజుల నుంచి 60 నెలల వరకు వివిధ కాలపరిమితులు ఉన్నాయి.  ఎలాంటి పేపర్‌‌‌‌వర్క్ లేకుండా, మొత్తం ప్రక్రియను టైడ్ యాప్ ద్వారానే పూర్తి చేయవచ్చు.  సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఎఫ్​డీ సేవలను అందిస్తున్నామని టైడ్​ తెలిపింది.