పురుగుల మందు తాగి ఇద్దరు రైతుల ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఇద్దరు రైతుల ఆత్మహత్య
  • పురుగుల మందు తాగి ఇద్దరు రైతుల ఆత్మహత్య
  • మెదక్‌‌‌‌ జిల్లాలో ఒకరు, వరంగల్‌‌‌‌ జిల్లాలో మరొకరు 

పాపన్నపేట/రాయపర్తి, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు, అప్పుల బాధతో మరొక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్​ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన సార సత్యనారాయణ (42)కు మూడెకరాల పొలం ఉంది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గత రెండు, మూడేండ్లుగా ఆశించినంతగా పంట దిగుబడి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం గ్రామ శివారులోని దర్గా వద్ద విషం తాగాడు. గమనించిన స్థానికులు అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేసరికే సత్యనారాయణ చనిపోయాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కాగా, వరంగల్‌‌‌‌ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన గూబ మహేందర్‌‌‌‌‌‌‌‌​(26) రెండెకరాల భూమిలో మిర్చి సాగు చేశాడు. పంట పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందాడు. దీంతో ఈనెల 15న పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు తొర్రూరులోని ఓ ప్రైవేటు ​హాస్పిటల్‌‌‌‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం మృతుడి భార్య లావణ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.