అందుబాటులోకి రెండు పాసివ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌

 అందుబాటులోకి రెండు పాసివ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  మోతీలాల్‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌ అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీ ... ఎస్‌‌‌‌ అండ్‌‌‌‌ పీ బీఎస్‌‌‌‌ఈ ఫైనాన్షియల్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌  బ్యాంక్‌‌‌‌– 30 ఇండెక్స్‌‌‌‌ ఫండ్‌‌‌‌, ఎస్‌‌‌‌ అండ్‌‌‌‌ పీ బీఎస్‌‌‌‌ఈ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌ ఈటీఎఫ్‌‌‌‌ పేరుతో రెండు పాసివ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ ను అందుబాటులోకి తెచ్చింది.  ఈ రెండు ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఓలను సబ్​స్క్రిప్షన్​ కోసం 14 జూలై 2022న తెరిచారు. ఈ నెల 22న మూసివేస్తారు. మోతీలాల్‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌  ఎస్‌‌‌‌ అండ్‌‌‌‌ పీ బీఎస్‌‌‌‌ఈ ఫైనాన్షియల్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌  బ్యాంక్‌‌‌‌– 30 ఇండెక్స్‌‌‌‌ ఫండ్‌‌‌‌  కొత్తరకం పాసివ్‌‌‌‌ ఫండ్‌‌‌‌. బ్యాంకులను మినహాయించి మిగతా ఆర్థిక సేవల రంగంలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఇండెక్స్‌‌‌‌ను   జూన్‌‌‌‌, డిసెంబర్‌‌‌‌ నెలల్లో రీబ్యాలెన్స్‌‌‌‌ చేస్తారు. ఇందులో  హౌసింగ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ కంపెనీలు, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీ, ఎక్చేంజ్‌‌‌‌లు, ఎస్సెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కంపెనీలు, బీమా, కార్డ్‌‌‌‌ చెల్లింపులు, ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ మొదలైనవి ఉంటాయి.  ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఓ సమయంలో కనీసం 500 రూపాయలు పెట్టుబడి పెట్టాలి.