
విరాటపర్వం, గార్గి చిత్రాలకు గాను ఒకే ఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులని గెలుచుకుంది సాయిపల్లవి. దీంతో తన కెరీర్‌లో గెలుచుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డులు సంఖ్య ఆరుకి చేరింది. ఈ సందర్భంగా ‘తండేల్’ మూవీ టీమ్ ఆమెను సత్కరించింది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. షూటింగ్ గ్యాప్‌లో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటితో పాటు టీమ్ అంతా సాయిపల్లవిని అభినందిస్తూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు.