
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా రెండు, మూడు ర్యాంక్‌లను సాధించారు. ప్రస్తుతం వీళ్ల ఖాతాలో వరుసగా 857, 825 పాయింట్లున్నాయి. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (865) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, రాస్ టేలర్ (801), ఆరోన్ ఫించ్ (791) 4,5 ప్లేస్ల్లో నిలిచారు. కోహ్లీ, రోహిత్ మినహా.. ఇండియా నుంచి టాప్–10లో ఒక్కరు కూడా లేరు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా (690) ఐదో ర్యాంక్‌లో ఉండగా, ట్రెంట్ బౌల్ట్ (737) టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ మెహిదీ హసన్ (725) ఫస్ట్ టైమ్ సెకండ్ ర్యాంక్‌లో నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న వరల్డ్‌కప్ సూపర్ లీగ్ సిరీస్‌ల్లో రాణించడం హసన్‌కు కలిసొచ్చింది. 2009లో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్.. తొలిసారి ఫస్ట్ ర్యాంక్‌లో నిలవగా, 2010లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అబ్దుర్ రజాక్ సెకండ్ ర్యాంక్‌ను సాధించాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్ (708) థర్డ్ ప్లేస్‌కు పడిపోయాడు. మ్యాట్ హెన్రీ (691) నాలుగో ర్యాంక్‌లో ఉండగా, రబాడ (666), క్రిస్ వోక్స్ (665), హాజిల్‌వుడ్ (660), ముస్తాఫిజుర్ (652), కమిన్స్ (646) వరుసగా ఆరు నుంచి పది ర్యాంక్‌ల్లో ఉన్నారు.