విద్యార్థులను తిట్టారని..ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు

విద్యార్థులను తిట్టారని..ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి:విద్యార్థులు, వారి తల్లిదండ్రులపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఇద్దరు ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ విద్యాశాఖ అధికారులు చేశారు. పటాన్ చెరు మండలం ముత్తంగి ప్రాథమిక పాఠశాలలో ఎస్ జీటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డి.సందీప్రెడ్డి, యన్. నర్సింహులు ను విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల వీరిద్దరు అమర్యాదగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులు అందడంతో సస్పెండ్ చేశారు.