
ఇటలీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అయితే తక్కువ వేగంలో వెళ్తుండగా రెండు రైళ్లు ఢీకొట్టుకోవడంతో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని రైలు ఆపరేటర్ చెప్పారు.
బోలోగ్నా, రిమిని మధ్య లైన్‌లో ఎదురెదురుగా వస్తున్న హై-స్పీడ్ రైలు, ప్రాంతీయ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన ఫెన్జా నగరం, ఫోర్లి కమ్యూన్ మధ్య చోటు చేసుకుంది. ఢీ కొట్టుకున్న రైళ్లలో హై స్పీడ్ రైలు ముందుభాగం నుజ్జునుజ్జవగా ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది.
ఈ సంఘటనపై ఇటలీ ఉప ప్రధాని. రవాణా మంత్రి మాటియో సాల్విని మాట్లాడుతూ తాను పరిస్థితిని సమీక్షిస్తున్నానని, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఏమి జరిగిందనే దానిపై వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులను కోరారు.