
కోదాడ, వీణవంక, వెలుగు: వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమీర్యాల గ్రామానికి చెందిన కొండా పుల్లమ్మ (41) ఉపాధి హామీ పథకంలో కూలీగా పనిచేస్తున్నది. 3రోజుల కింద కూలికి వెళ్లిన సమయంలో ఆమె వడదెబ్బకు గురైంది. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలానికి చెందిన ఉపాధి కూలి వడదెబ్బతో చనిపోయాడు. కోర్కల్ గ్రామానికి చెందిన ఎండీ అఫ్జల్(60) బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. రాత్రి అన్నం తిని పడుకొని నిద్రలోనే చనిపోయినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.