హైవేపై రెండు లారీలు దగ్ధం...ఆదిలాబాద్‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌ మండలంలో ఘటన

హైవేపై  రెండు లారీలు దగ్ధం...ఆదిలాబాద్‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌ మండలంలో ఘటన

గుడిహత్నూర్, వెలుగు : రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో మంటలు అంటుకొని కాలిపోయాయి. ఈ ఘటన ఆదిలాబాద్‌‌ జిల్లా గుడిహత్నూర్‌‌ మండలం సీతాగోంది సమీపంలోని నేషనల్‌‌ హైవే 44పై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కంటెయినర్‌‌ లారీ నిర్మల్‌‌ వైపు నుంచి ఆదిలాబాద్‌‌ వైపు వెళ్తోంది. హైవేపై సీతాగోంది సమీపంలోని సబ్‌‌స్టేషన్‌‌ వద్దకు రాగానే వెనుక వచ్చిన మరో లారీ కంటెయినర్‌‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు లారీల డ్రైవర్లు అక్కడి నుంచి పారిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్‌‌ ఇంజిన్‌‌కు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కంటెయినర్‌‌ పూర్తిగా కాలిపోగా.. మరో లారీ పాక్షికంగా దగ్ధమైంది. కంటెయినర్‌‌లో ఉన్న దుస్తులు, ఇతర ఆయుర్వేద మందులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.