
ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్ జిల్లా తడొకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్నార్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన రెండు SLR లు, ఒక 303, ఒక 315 తుపాకులును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.