చత్తీస్​గఢ్​ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​ ఎన్‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
  • మందుపాతర పేలి ఇద్దరు బస్తర్​ ఫైటర్స్ జవాన్లకు తీవ్ర గాయాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లోని అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర కుమార్  యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్  రాయ్, సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహాన్​ల​ నేతృత్వంలో డీఆర్​జీ, బస్తర్​ ఫైటర్స్, కోబ్రా బలగాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్​గఢ్  రాష్ట్రాల సరిహద్దుల్లో శనివారం ఉదయం నుంచి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలో బీజాపూర్ జిల్లా పిడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి బస్తర్​ ఫైటర్స్ కు చెందిన ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం హెలికాప్టర్​లో రాయ్​పూర్​కు తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలను అడవుల్లోకి పంపించి మూడు జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో గాలిస్తున్నారు. డామినేషన్​ కోసం పంపిన బలగాలతో పాటు అడవుల్లో ఉన్న వారిని తరలించేందుకు హెలికాప్టర్లను సిద్ధం చేశారు.