
షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో హీరో, అతని స్నేహితుడు కారులో వెళుతూ రోడ్లపై కరెన్సీ నోట్లను విసురుతారు. సరిగ్గా గురుగ్రామ్‌లోని ఓ ఇద్దరు వ్యక్తులు కూడా ఇలాగే చేశారు. కారులో నుంచి కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వైట్ కారులో ఒక వ్యక్తి కారు నడుపుతుండగా మరో వ్యక్తి ట్రంక్‌లోంచి కరెన్సీ నోట్లను బయటకు విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులను గుర్తించామని, ఇద్దరిని ఆదుపులోకి తీసుకున్నామని గురుగ్రామ్ ఏసీపీ వికాస్ కౌశిక్ వెల్లడించారు. అయితే ఆ విసిరిన కరెన్సీ నోట్లు నకిలీవో, నిజమో ఇంకా తెలియరాలేదు. కాగా ఈ ఏడాది జనవరిలో బెంగళూర్‌లోని కేఆర్ పురం ఫ్లైఓవర్ నుంచి కింద ఉన్న ప్రజలపై గుర్తుతెలియని వ్యక్తి రూ. 10 నోట్లను విసిరిన వీడియో వైరల్ అయింది. దీంతో ఫ్లైఓవర్‌తో పాటు కిందనున్న రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇక గుజరాత్ లో తన మేనల్లుడి పెండ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ తన ఇంటి పై అంతస్దు నుంచి నోట్ల కట్టలను ప్రజలపై విసిరివేయడం దుమారం రేపింది.