ఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు.. ఢిల్లీకి చేరుకున్న 471 మంది

ఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు.. ఢిల్లీకి చేరుకున్న 471 మంది

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ విమానాల్లో 471 మంది మనోళ్లు వచ్చారు. ‘‘మూడో ఫ్లైట్ లో 197 మంది, నాలుగో ఫ్లైట్ లో 274 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం నాలుగు ఫ్లైట్లు నడిపాం” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఆదివారం ట్విట్టర్ లో వెల్లడించారు. ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికుల ఫొటోలను కూడా షేర్ చేశారు. కాగా, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన మనోళ్లకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. మరో ఫ్లైట్ సోమవారం వస్తుందని ఆయన తెలిపారు.