రామ్​సర్​ సైట్ల జాబితాలోకి మరో రెండు చిత్తడి నేలలు

రామ్​సర్​ సైట్ల జాబితాలోకి మరో రెండు చిత్తడి నేలలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 పురస్కరించుకొని దేశంలో మరో రెండు చిత్తడి నేలలను రామ్​సర్ సైట్ల జాబితాలో చేర్చారు. బిహార్​లోని జముయు జిల్లాలోని ఝఝూ అటవీ ప్రాంతంలో ఉన్న మానవ నిర్మిత రిజర్వాయర్లు నాగి, నక్తి పక్షుల అభయారణ్యాలు రామ్​సర్​ జాబితాలోకి చేరాయి. 

నక్తి పక్షుల అభయారణ్యం 

భారత ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం నక్తి ఆనకట్ట నిర్మాణం ద్వారా నీటిపారుదల కోసం ఈ పక్షుల అభయారణ్యం అభివృద్ధి చేశారు. ఈ చిత్తడి ప్రాంతాన్ని 1984లో అభయారణ్యంగా గుర్తించారు. శీతాకాలంలో 2000కు పైగా వలస పక్షులు ఇక్కడ సేద తీరుతాయి. వీటిల్లో ముఖ్యంగా ఇండో – గంగా మైదాన ప్రాంతంలో రెడ్​ క్రెస్టడ్​ పోచర్డ్​ పక్షుల సమూహం అధికంగా ఉన్నాయి. 

నాగి పక్షుల అభయారణ్యం

ఈ అభయారణ్యం 75 పక్షిజాతులకు, 33 చేప జాతులకు ,12 జలచార వృక్షజాతులకు నివాసంగా ఉంది. ప్రధానంగా ఇండో గంగా మైదాన ప్రాంతంలో బార్​ హెడేడ్​ గీస్​ పక్షుల సమూహం అత్యధికంగా ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ అభయారణ్యం నాగినదికి ఆనకట్ట అవతల నిర్మించారు. స్వచ్ఛమైన నీటితోపాటు జలచార వృక్ష సంపద వంటి నీటి వనరులను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించింది. ప్రపంచ వ్యాప్తంగా 2400 రామ్​సర్​ చిత్తడి నేలలు 172 దేశాల్లో 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకు రక్షిస్తున్నారు.