వరంగల్ లో దంచికొట్టిన వాన.. వరదల్లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు

వరంగల్ లో దంచికొట్టిన వాన.. వరదల్లో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు

వరంగల్ లో  భారీ వర్షాలు పడుతున్నాయి. అర్థరాత్రి నుంచి కురుస్తున్న  వానకు వరద పోటెత్తింది. రోడ్లపైకి నీరు చేరింది.  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు కాలనీలు జలదిగ్భందంలో  చిక్కుకుపోయాయి..ఇళ్లలోకి వరద చేరడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. 

వరంగల్ రైల్వే బ్రిడ్జి పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపి  తాళ్ల సహాయంతో ప్రయాణికులకు  బయటకు తీసుకుని వచ్చారు  ఇంతేజార్ గంజ్  పోలీసులు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు,  హనుమాన్ జంక్షన్ కు పూర్తిగా రాకపోకలకు అంతరాయం కల్గింది.

వరంగల్, హన్మకొండలో ఏకదాటిగా వర్షం పడింది. రాత్రి నుంచి ఉదయం వరకు వరంగల్ లో  6 సెం.మీ, హన్మకొండలో.5.5 సెం.మీ వర్షం పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.