బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవం

బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవం

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం ముత్తాపూర్ ​సర్పంచ్​గా ఎండీ మున్నాబి, కాసిపేట మండలంలో ధర్మారావుపేట సర్పంచ్​గా జూగునాక రాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముత్తాపూర్​లో సర్పంచ్ ​స్థానానికి ఒకే నామినేషన్​ వేయడంతో పాటు మొత్తం 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్​ వచ్చాయి.

 దీంతో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ధర్మారావుపేటలో సర్పంచ్​తో పాటు మొత్తం 7 వార్డులకు గానూ 4 స్థానాలకు ఒక్కో  నామినేషన్​వచ్చింది. దీంతో ఆ నలుగురు సభ్యలు కూడా ఏకగ్రీవమయ్యారు.