ఒకే వ్యక్తిని పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్

ఒకే వ్యక్తిని పెళ్లాడిన ట్విన్ సిస్టర్స్

మహారాష్ట్రలోని సోలాపూర్‭లో ఇద్దరు పెళ్లికూతుళ్లూ ఒక వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇద్దరి పోలికలు ఒకేలా ఉండటం చాలా అరుదుగా చూసి ఉంటాం. ఈ ఇద్దరు ట్విన్ సిస్టర్స్ చూసేందుకు ఒకేలా ఉంటారు. కవల అక్కా చెల్లెళ్లు పింకీ, రింకీ.. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోలాపూర్‭లోని మల్షిరాస్ తాలూకాకు చెందిన అక్లూజ్ అనే వ్యక్తి ఈ ట్విన్ సిస్టర్స్‭ను పెళ్లి చేసుకున్నాడు. 

ఈ కవలలు ఇద్దరూ ఐటీ ఇంజనీర్లు. ఇరు కుటుంబసభ్యులు అంగీకరించడంతో ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‭గా మారింది. ఇది చూసిన నెటిజన్లు విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే భారీగా లైకులు వచ్చాయి.