టూ వీలర్స్‌‌కు మస్తుజోష్.. పెరుగుతోన్న సేల్స్

టూ వీలర్స్‌‌కు మస్తుజోష్.. పెరుగుతోన్న సేల్స్

ప్రొడక్షన్ పెంచుతున్న కంపెనీలు
ఫెస్టివ్ సీజన్‌‌పై పెద్ద ఎత్తు నే ఆశలు

న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్‌ నుంచి బజాజ్ ఆటో వరకు టూవీలర్ కంపెనీలన్ని తమ ప్రొడక్షన్ పెంచుతున్నాయి. లాక్‌‌డౌన్ తర్వాత రూరల్, సెమీ అర్బన్ మార్కెట్ల నుంచి వస్తోన్న డిమాండ్‌‌ను అందుకోవడానికి కంపెనీలు తమ ప్రొడక్షన్‌ను పెం చుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. హీరో మోటో కార్ప్ అయితే ఏకంగా ఈ కరోనా కాలంలో పది కోట్ల టూవీలర్స్ సేల్స్‌ మార్క్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో వరల్డ్ రికార్డు సాధించాలని ప్లాన్ చేస్తోంది. కరోనా వల్ల టూవీలర్ ఇండస్ట్రీ షార్ట్ టర్మ్ ఛాలెంజస్‌ను ఎదుర్కొందని, కానీ మొత్తంగా ఇండియా గ్రోత్ స్టోరీ చాలా బాగుందని హీరో మోటో కార్ప్ తన యాన్యువల్ రిపోర్ట్ లో‌ తెలిపింది. హీరో మోటో కార్ప్‌ సీనియర్ మేనేజ్‌‌మెంట్ తన వెండర్ల‌ను నెలకు 6,50,000 వెహికల్స్ నుంచి 7,00,000 వెహికల్స్‌‌ను మాన్యుఫాక్చరింగ్ చేయాలని కోరింది. లాక్‌‌డౌన్ తర్వాత వచ్చిన డిమాండ్, ఫెస్టివ్ సీజన్ వరకు ఉంటుందని దేశంలోని ఈ అతిపెద్ద టూవీలర్ కంపెనీ చెబుతోంది. ‘హీరో ప్రొడక్షన్ పెంచడంపై చాలా బుల్లిష్‌‌గా ఉంది. జూలైలోనే ప్రీ కరోనా స్థాయిలను హీరో అందుకుంది. చెన్నైలో లాక్‌‌డౌన్ ఉన్నా, మాన్‌‌పవర్ అందుబాటులో లేకపోయినా.. ప్రొడక్ష న్‌ను మాత్రం పెంచుతూనే ఉన్నాం’ అని హీరో మోటో కార్ప్‌ చెప్పింది. సేల్స్ పెరగడంతో పాటు, హీరో వద్ద సుమారు రెండు లక్షల ఇన్వెంటరీ ఉంది.

హీరో సెప్టెంబర్, అక్టోబర్ 2018లో 7లక్షల ప్రొడక్షన్ మార్క్‌ను క్రాస్ చేసింది. తాజా ప్లాన్స్ ప్రకారం, మళ్లీ ఆ స్థాయిని చేరుకోవాలనుకుంటోంది. ఆగస్ట్ నుంచి బజాజ్ ఆటో కూడా నెలవారీ ప్రొడక్షన్‌ను 3,20,000 యూనిట్ల నుంచి 3,50,000 యూనిట్లకు పెంచాలనుకుంటోంది. ఔరంగబాద్ ప్లాంట్‌‌లో చాలామంది వర్కర్ల‌కు కరోనా వైరస్ వచ్చినప్పటికీ బజాజ్ ఆటో
మాత్రం ప్రొడక్షన్ పెంపుపైనే దృష్టి పెట్టింది. ఫెస్టివ్ సీజన్ కల్లా ప్రీ కరోనా ప్రొడక్షన్‌ను బజాజ్ ఆటో అందుకోవాలనుకుంటోంది. ఎంట్రీ లెవెల్ మోటా ర్ ‌‌సైకిల్స్ ‌‌డిమాండ్ చాలా త్వరగా రికవరీ అయింది. ముఖ్యంగా రూరల్, సెమీ అర్బన్ ఇండియా నుంచి
డిమాండ్ బాగా వస్తోంది. సాధారణ రుతుపవనాలు, వేసవి పంటలు బాగుండటం, కరోనా అవుట్ ‌‌బ్రేక్‌‌తో  ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను పక్కనపెట్టి వ్యక్తిగత వెహికల్ ‌‌పైనే దృష్టి పెట్ట‌డంతో మోటార్ సైకిల్స్‌కు డిమాండ్ పెరిగింది. మే, జూన్‌‌లో లాక్‌‌డౌన్ రూల్స్ సడలించాక, రిటైల్ సేల్స్ పుంజుకున్నట్టు కంపెనీలు చెప్పాయి. పెరిగిన ఈ డిమాండ్‌‌ను అందుకోవడానికే బజాజ్ ఆటో, మారుతీ సుజుకిలు అవుట్‌‌పుట్‌‌ను పెంచాయి. జూన్‌‌లో హీరో 4,50,744 యూనిట్లను డీలర్‌‌షిప్‌‌లకు అందించిం ది. మేలో కంపెనీ అందించిన అవుట్‌‌పుట్ 1,12,682యూనిట్లుగానే ఉంది. బజాజ్ ఆటో కూడా జూన్లో 2,55,122 యూనిట్లను డీలర్‌‌షిప్‌‌లకు అందించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..