
తిరుపతి: గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గురువారం (మే 15) ఆయన మీడియాకు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు లాడ్జిలో సిబ్బందితో కలిసి దాడులు చేశామని తెలిపారు.
లాడ్డిలో అనుమానస్పదంగా ఉన్న పశ్చిమ బెంగాల్ చెందిన మమోని మండల్, నమిత మండల్ అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద ఉన్న సూట్ కేసుల నుంచి 25.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ గంజాయిని ఒడిషా నుంచి కేరళకు తరలించే ప్రణాళికలో భాగంగా రేణిగుంట వద్ద దిగామని మహిళలు చెప్పారని తెలిపారు.
ALSO READ | నకిలీ ఆధార్ కార్డ్తో ప్లాట్స్ రిజిస్టేషన్స్.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్
ఇద్దరు మహిళలను అరెస్టు చేసి తిరుపతి కోర్టుకు రిమాండ్కు తరలించామన్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు 2 లక్షల 45 వేల రూపాయలు ఉంటుందని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన రేణిగుంట సీఐ జయ చంద్ర, ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి జిల్లాను మత్తు పదార్థాల నుంచి విముక్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.