
పంజాబ్ సంగ్రూర్ జిల్లాలో రెండేళ్ల పసివాడు బోరుబావిలో పడ్డాడు. గురువారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడగా సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అది 150 ఫీట్ల లోతు ఉంది. బోరుపై బట్టతో కప్పి ఉంచారు. బాలుడు అడుగు పెట్టగానే అందులోకి జారిపోయాడు. మొదట బాలుడి తల్లి కాపాడేందుకు ప్రయత్నించినా విఫలమైంది. బోరుబావిలో పడ్డ ఫతేవీర్ సింగ్ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
ఫతేవీర్ క్షేమంగా బయటపడాలంటూ గ్రామస్తులంతా పూజలు చేస్తున్నారు. NDRF , ఆర్మీ నిపుణులు సహా స్థానిక అధికారులు, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బోరుబావికి సమాంతరంగా పెద్ద గొయ్యి తవ్వారు. గురువారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కెమెరాను బోరుబావిలోకి పంపి బాలుడి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నిన్న ఉదయం బాలుడి కదలికలు గుర్తించారు. ఆక్సిజన్ అందేలా చూస్తున్నారు. ప్రస్తుతం 90 ఫీట్ల వరకు తవ్వకాలు చేశారు.