కారు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

V6 Velugu Posted on Nov 23, 2021

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. జిల్లాలోని భీంగల్ మండలము పిప్రి, బాచన్పల్లి గ్రామాలకు చెందిన మనోజ్, శ్రవణ్, భరత్‌ అనే ముగ్గురు యువకులు కలిసి సోమవారం రాత్రి ఆర్మూర్ వెళ్తున్నారు. మోతె గ్రామం దాటినా తర్వాత ముల మాలుపు వద్ద కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్నత తటి చెట్టును బలంగా ఢీకొట్టింది. 

కారు ఫుల్ స్పీడ్లో ఉండటంతో కారు నడుపుతున్న మనోజ్ తోపాటు అందులో శ్రావన్‌  అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరో స్నేహితుడు భరత్ కి  తీవ్రగాయాలయ్యాయి. అయితే  రహాదారి వెంట మూల మలుపు ఉన్నా... ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో... అతివేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాధమిక విచారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Tagged road accident, car accident, nizamabad road accident, telangana road accident

Latest Videos

Subscribe Now

More News