సూర్యాపేటలో తెరిపివ్వని వాన

సూర్యాపేటలో తెరిపివ్వని వాన
  • దెబ్బతింటున్న పంటలు

సూర్యాపేట, మేళ్లచెరువు, వెలుగు: తుపాన్‌‌‌‌ సూర్యాపేట జిల్లాను వదలడం లేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  పంటలు దెబ్బతింటున్నాయి. చింతలపాలెం మండలంలోని వేల ఎకరాల్లో  మిర్చి, పత్తి పంటలు నాశనమయ్యాయి.

చేతికొచ్చే సమయం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.  పత్తికి ఎకరానికి రెండు లక్షల పెట్టుబడి పెట్టామని పంట తీసే టైమ్‌‌‌‌లో వానలు ఆగం చేస్తున్నాయని వాపోతున్నారు. మొన్నటి వరకు  సాగర్ నీళ్లు రాక తిప్పలు పడ్డామని, ఏదోలా పంట పండిస్తే ఇప్పుడు తుపాన్ ఆగం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని కోరుతున్నారు. 


 మునగాలలో అత్యధిక వర్షపాతం నమోదు


జిల్లాలో అత్యధికంగా మునగాల మండలంలో  60.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  మోతే మండలంలో 56.2 మి.మీ., మేళ్లచెర్వులో 53.6 మి.మీ., మట్టంపల్లి 51.2 మి.మీ., నూతన్ కల్‌‌‌‌లో 49.2 మి.మీ., అనంతగిరిలో 48.8 మి.మీ., నడిగూడెంలో 48.6 మి.మీ., ఆత్మకూర్(ఎస్)లో 43.6 మి.మీ., గరిడేపల్లిలో 43.2 మి.మీ., హుజూర్ నగర్‌‌‌‌‌‌‌‌లో  42.6 మి.మీ., నేరేడుచర్లలో 41.0 మి.మీ., కోదాడలో 40.2 మి.మీ., చిలుకూరులో 39.8 మి.మీ., సూర్యాపేటలో 38.6 మి.మీ., చింతలపాలెం లో 35.2, చివ్వెంలలో 34.2 మి.మీ., మద్దిరాలలో 31.4 మి.మీ., తుంగతుర్తిలో 26.2 మి.మీ.,  జాజిరెడ్డి గూడెంలో 24.8 మి.మీ., నాగారంలో 23.8మి.మీ., తిరుమలగిరిలో 23.8  మి.మీ. వర్షపాతం నమోదైంది.