హనోయ్:వియత్నాంలో యాగీ తుపాన్ బీభత్సం సృష్టిస్తున్నది. తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు, వరదలతో శనివారం నుంచి ఇప్పటిదాకా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గల్లంతయ్యారు. ఒకచోట స్టీల్ బ్రిడ్జీ ఒక్కసారిగా కూలిపోవడంతో దానిపై వెళ్తున్న కార్లు, ట్రక్కులు వరదలో పడి కొట్టుకు పోయాయి.
మవారం ఉదయం ఫూథో ప్రావిన్స్‌లోని రెడ్ రివర్ పై ఉన్న ఉక్కు బ్రిడ్జీ కూలిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో పది కార్లతోపాటు రెండు బైక్‌లు, ట్రక్కులు నదిలో పడిపోయాయని తెలిపింది. ముగ్గురిని కాపాడి ఆస్పత్రికి తరలించగా 13 మంది గల్లంతయ్యారు.
టైన్స్ కావో బ్యాంగ్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 20 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న బస్సు వరదలో కొట్టుకుపోయింది. రెస్య్యూ టీమ్స్ రంగంలోకి దిగిన ప్పటికీ ప్రతికూల వాతావరణం వల్ల ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు.
149 కి.మీ. వేగంతో గాలులు
యాగీ తుపాన్ శనివారం వియత్నాంను తాకింది. దీని ప్రభావంతో 149 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. తుపాను మరింత బలహీనపడటంతో కుండపోత వర్షాలు పడ్డాయి. వరదలు పోటెత్తడంతో ఆదివారం సా పా పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. రోడ్లపైకి నీరు భారీగా చేరింది. చెట్లు, బిల్‌బోర్డ్‌లు పడిపోవడంతో కరెంట్ సప్లై నిలిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
రెంటు లేక ఫూథో, మౌంటైన్స్ కావో బ్యాంగ్ ప్రావిన్స్‌ల లో కంపెనీలు మూతపడ్డాయి. దాదాపు 100 ఫ్యాక్టరీలు తుపాన్ కారణంగా దెబ్బతిన్నాయని, ఫలితంగా మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లిందని సమాచారం.
రిశ్రామిక యూనిట్లలోకి నీరు చేరడంతో ఫ్యాక్టరీల పైకప్పులు ఎగిరిపోయా యని, ఇప్పటికే ఉత్పత్తి చేసిన వస్తువులు, పరికరాలు దెబ్బతిన్నాయని వివరించారు. కొన్ని చోట్ల 40 సెం.మీ.కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడంతో పంటలన్నీ నీటమునిగాయి.