ఓరి దేవుడా.. టైర్ పేలి గాల్లోకి ఎగరిపడి చనిపోయాడు

ఓరి దేవుడా.. టైర్ పేలి గాల్లోకి ఎగరిపడి చనిపోయాడు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ లో ఓ బస్ డ్రైవర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రైవర్  టైర్ లో గాలి నింపుతుండగా గాలి ఎక్కువై సడెన్ గా టైర్ పేలిపోయింది. దీంతో గాలి కొడుతున్న డ్రైవర్ గాలిలోకి ఎగిరి రెండు మూడు పల్టీలు కొట్టి కింద పడ్డాడు. ఈ ఘటన కిషన్‌గఢ్ సమీపంలోని రూపన్‌గఢ్ ప్రాంతంలోని పర్బత్‌సర్ మార్గ్‌లోని గుజరాతీ హోటల్ సమీపంలో  జరిగింది. డైవర్ ఎగిరి పడే వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేగా ఉంది. ఈ ప్రమాదంలో వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడు లోసల్ సికార్‌కు చెందిన బోదురామ్ జాట్‌గా పోలీసులు గుర్తించారు.