ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో బ్రిటన్‌ ప్రధాని

ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో బ్రిటన్‌ ప్రధాని

బ్రిటన్‌ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత నెల 26 న కరోనా బారిన పడగా.. కొద్ది రోజులపాటు తన వ్యక్తిగత  డాక్టర్ల సహయంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందారు. నిన్న సాయంత్రానికి, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో దీంతో ఆయన్ని వెంటనే లండన్‌లోని సెయింట్‌ థామస్‌ ఆస్పత్రిలో చేర్చి ఇంటెన్సివ్‌ కేర్‌లో కృత్రిమ శ్వాస అందించి వైద్యం చేస్తున్నారు. 55 ఏళ్ల జాన్సన్‌ను అవసరమైతే వెంటిలేటర్‌పై ఎక్కిస్తామని డాక్టర్లు ప్రకటించారు. ఇప్పటికైతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రమాదకర పరిస్థితిని ఇంకా అధిగమించలేదని చెబుతున్నారు. అయితే ఆయన స్పృహలోనే ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో చేరే ముందు విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్‌కు అత్యవసర సమయాల్లో నిర్వహించాల్సిన తన ప్రధాన మంత్రి బాధ్యతలు చూడాలని కోరినట్టు అధికార వర్గాలు చెప్పాయి. అయితే… ఆయన్ను తాత్కాలిక ప్రధానిగా ప్రకటించలేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వ వ్యవహారాలన్నీ సజావుగానే సాగుతున్నాయని, మంత్రుల అందరూ టీమ్‌ స్పిరిట్‌తో పనిచేస్తున్నారని డొమినిక్ రాబ్‌ వివరించారు.