సిప్లాడిన్ అంబాసిడర్గా నీనా గుప్తా

సిప్లాడిన్ అంబాసిడర్గా నీనా గుప్తా

హైదరాబాద్​, వెలుగు:  కన్జ్యూమర్ హెల్త్ కేర్ కంపెనీ సిప్లా హెల్త్ తన కొత్త ప్రొడక్టు సిప్లాడిన్ యాంటీసెప్టిక్ ఆయింట్​మెంట్​ ​ప్రచారం కోసం సినీనటి నీనా గుప్తాను నియమించుకుంది. 

ఆమెతో "సిప్లాడిన్​ - ఆప్కా ఫాస్ట్ ఎయిడ్ ఎక్స్ పర్ట్" పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోతలు, గాయాలు, కాలిన గాయాలు,  అంటువ్యాధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సిప్లా తెలిపింది. 

పోవిడోన్ అయోడిన్ ఫార్ములా కారణంగా సిప్లాడిన్​ చర్మంపై ఎక్కువసేపు ఉంటుందని, లోతుగా చొచ్చుకుపోతుందని  కేవలం 30 సెకన్లలో పనిచేయడం ప్రారంభిస్తుందని   సిప్లా హెల్త్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ శివమ్ పురి చెప్పారు.