ఉదయ్ పూర్ నిందితులపై దాడి

ఉదయ్ పూర్ నిందితులపై దాడి

ఉదయ్ పూర్ లో దారుణ ఘటనకు పాల్పడిన నిందితులను జైపూర్ లోని ఎన్ఐఏ (NIA) కోర్టుకు తరలించారు. నిందితులను భారీ భద్రత మధ్య తీసుకొచ్చారు. అయితే.. ఎస్కార్ట్ తో తీసుకెళుతుండగా.. జనాలు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వారిని ఎలాగో రక్షించి.. అక్కడి నుంచి తరలించారు. మరోవైపు నలుగురు నిందితులను పది రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు ఎన్ఐఏ కోర్టు వెల్లడించింది. 

ఉదయ్ పూర్ దర్జీ కన్నయ్య లాల్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చారనే కారణంతో.. కన్నయ్య లాల్ ను జూన్ 28న దారుణంగా హత్య చేశారు. పాకిస్థాన్ కు చెందిన ఇద్దరు నిందితులు రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేశారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఘటన అనంతరం ఉదయ్ పూర్ అట్టుడికింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఏర్పడింది.