హైటెక్ యుగంలో పండగయినా.. పబ్బం అయినా ఫ్రెండ్స్ కు.. బంధువులకు శుభాకాంక్షలు చెప్పడం సర్వ సాధారణమైంది. గతంలో .. ఉత్తరాల ద్వారా చెప్పేవారు.. ఆ తరువాత టెలిగ్రామ్ కల్చర్.. టెలిఫోన్ ద్వారా... మొబైల్ ద్వారా.. ఇప్పుడు వాట్సప్ ద్వారా శుభాకాంక్షలు చెపుతున్నారు. కాలం మారే కొద్ది ఆధునికత కూడా మారింది కదా. ఉగాది పండగ రోజున మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి. ప్రత్యేకంగా కొన్ని ఉగాది శుభాకాంక్షల సందేశాలను ఈ ఆర్టికల్లో అందిస్తున్నాము. మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని మీ శ్రేయోభిలాషులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలపండి.
తెలుగులో ఉగాది శుభాకాంక్షలు
- తెలుగింటి వారికి ఈ నూతన సంవత్సరంబాగా కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంశుభాకాంక్షలు.
- అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయినా బ్యాంకాక్ అయినా ఉగాది పండుగని ఆనందంగా జరుపుకో, మన సంప్రదాయాన్ని నిలుపుకో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- ఈ ఉగాది మీకు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు.
- ఉగాది అంటే అన్నీకొత్తవే, కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు .మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీ లక్ష్యాలను మీరు సాధించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు .
- లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లాపాపలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. జీవితం సకల అనుభూతుల మిశ్రమంస్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణంఅదే ఉగాది తెలిపే సందేశంమీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
- మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
ఉగాది అంటే తెలుగు వారికి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభోత్సవ పండగ. తెలుగువారింట్లో అదో పెద్ద పండగ. తెలుగు దనం ఉట్టిపడే పండగ. ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం. పురాణాల్లో ఉగాది గురించి విశిష్టంగా చెప్పబడి ఉంది. ఉగాది రోజే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడంటారు. విష్ణుమూర్తి మత్య్సావతారాన్ని ధరించి, వేదాలను హరించిన సోమకుడిని సంహరించింది కూడా అదే రోజని పురుణాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి అన్ని రకాలు షడ్రుచులు ఉన్నట్లే జీవితంలో కూడా కష్టసుఖాలు అన్నీ ఉంటాయని ఈ పండగ మనకు గుర్తు చేస్తుంది.