అమెజాన్​లో​ఉగాది షాపింగ్ స్టోర్

అమెజాన్​లో​ఉగాది షాపింగ్ స్టోర్

హైదరాబాద్​, వెలుగు :  ఉగాది  పండుగకు అవసరమైన వస్తువులను తక్కువ ధరలకు అందించడానికి ఈ–కామర్స్​కంపెనీ అమెజాన్ తన ఫ్లాట్​ఫారాల్లో​ ‘ప్రత్యేక షాపింగ్ స్టోర్’ను అందుబాటులోకి తెచ్చింది. ఎథ్నిక్ వేర్, గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, హోమ్ డెకోర్, ఫ్యాషన్, యాక్సెసరీలపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.

ఈ షాపింగ్ స్టోర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అమెజాన్​తెలిపింది.  ఫిలిప్స్, శామ్‌‌సంగ్, ఎంఐ, వన్ ప్లస్, రియల్మి, బీబా, డబ్ల్యూ, జనస్య, అమెజాన్,  లైఫ్‌‌లాంగ్ వంటి వాటిపై బ్రాండ్లపై డీల్స్​కూడా ఉంటాయి. పార్టిసిపేటింగ్ సెల్లర్స్ ద్వారా ఆఫర్స్,  డీల్స్ పొందవచ్చు.