దేశవ్యాప్తంగా 22 ఫేక్ యూనివర్సిటీలు.. ఢిల్లీలోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి ఇవే !

దేశవ్యాప్తంగా 22 ఫేక్ యూనివర్సిటీలు.. ఢిల్లీలోనే ఎక్కువ.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి ఇవే !

దేశ వ్యాప్తంగా ఉన్న ఫేక్ యూనివర్సిటీల లిస్టును విడుదల చేసింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).  యూజీసీ చట్టం -1956 ప్రకారం ఫేక్ యూనివర్సిటీల జాబితాను విడుదల చేయగా.. అందులో ఢిల్లీలోనే ఎక్కువ నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల నుంచి ఎలాంటి కోర్సులు చేసినా.. అవి చెల్లనివిగా పరిగణిస్తామని విద్యార్థులను హెచ్చరించింది.

ఫేక్ యూనివర్సిటీల లిస్టులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 10 ఫేక్ యూనివర్సిటీలతో దేశ వ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఫేక్ యూనివర్సిటీల లిస్టు:

ఢిల్లీ:

  1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం

  2. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్, ఢిల్లీ

  3. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఢిల్లీ

  4. ఒకేషనల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ

  5. ADR-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ, ADR హౌస్, 8J, గోపాల టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ – 110008

  6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, న్యూఢిల్లీ

  7. విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్-ఎంప్లాయ్‌మెంట్, రోజ్‌గర్ సేవాసదన్, 672, సంజయ్ ఎన్‌క్లేవ్, GTK డిపో ఎదురుగా, ఢిల్లీ-110033

  8. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం), రితాలా, రోహిణి, ఢిల్లీ-110085

  9. వరల్డ్ పీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ (WPUNU), పితంపుర, న్యూఢిల్లీ-110034

  10. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్, 1810/4, మొదటి అంతస్తు, కోట్ల ముబారక్‌పూర్

ఉత్తర ప్రదేశ్

11.గాంధీ హిందీ విద్యాపీఠం, ప్రయాగ్, అలహాబాద్

12.నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ), అచల్తాల్, అలీగఢ్

13.భారతీయ శిక్షా పరిషత్, భారత్ భవన్, మతియారి చిన్హాట్, ఫైజాబాద్ రోడ్, లక్నో - 227105

14.మహామాయా నగర్, 10 మహామాయా నగర్, టెక్నికల్ యూనివర్సిటీ, 10 మహామాయ, టెక్నికల్ యూనివర్సిటీ నోయిడా - 201304

పశ్చిమ బెంగాల్

15. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్కతా
16. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, 8-ఎ, డైమండ్ హార్బర్ రోడ్

మహారాష్ట్ర

17. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగ్పూర్

పుదుచ్చేరి

18. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నెం. 186, థిలాస్‌పేట్, వజుతావూర్ రోడ్ - 605009

కేరళ

 19.ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM), కున్నమంగళం కోజికోడ్
20.సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కిషనట్టం

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫేక్ యూనివర్సిటీలు:

21. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్,
22. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, హోం నెం. 49-35-26, ఎన్జీఓస్ కాలనీ, విశాఖపట్నం – 530016

ఫేక్ యూనివర్సిటీల లిస్టు విడుదల చేసిన యూజీసీ.. అదే క్రమంలో దేశ వ్యాప్తంగా 101 యూనిర్సిటీలు, కేటగిరీ-1 లో ఉన్న విద్యాసంస్థలకు ఓపెన్, డిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ప్రారంభించవచ్చునని పర్మిషన్ ఇచ్చింది. 

►ALSO READ | తోడు కోసం ఈదుకుంటూ కిలోమీటర్ల ప్రయాణం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చిన పెద్ద పులి..