Allari Naresh: ఉగ్రం.. అల్లరి నరేష్ నట విశ్వరూపం

Allari Naresh: ఉగ్రం.. అల్లరి నరేష్ నట విశ్వరూపం

ఇంతకాలం తన అల్లరితో నవ్వులు పూయించిన  అల్లరి నరేష్ ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇప్పటివరకు నటించిన నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, మహర్షి లాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అలాంటి సినిమా ‘ఉగ్రం’తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ ని ఇవాళ నాగచైతన్య విడుదల చేశాడు. ఈ సినిమాలో యాంగ్రీ పోలీస్ పాత్రలో, యాక్షన్ అవతారంలో నరేష్ కనిపించబోతున్నాడు. ఫ్యామిలీ, రివేంజ్, పోలీస్ ఆఫీసర్ డ్రామా నేపథ్యంలో టీజర్ ఉంది. యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మిర్నా మీనన్‌ కథానాయిక.