
శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. మాణిక్యాలమ్మగా గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని సైతం గాజుల తోరణాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు – వెలుగు, పద్మారావునగర్