రేపు హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం 

రేపు హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం 

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్‌ భూయాన్‌ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా...  ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది సప్పెన్స్ గా మారింది. ఇకపోతే... ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న సతీష్‌ చంద్రను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమ్జద్ ఎ. సయీద్ ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రష్మిన్ ఎం.ఛాయను గువాహటి హైకోర్టు సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్.షిండేను రాజస్థాన్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.