భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని

భారత్ చేరుకున్న బ్రిటన్  ప్రధాని

రెండ్రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ కు వచ్చిన.. బోరిస్ జాన్సన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఘన స్వాగతం పలికారు. గుజరాత్ లో ఇండస్ట్రీ ప్రతినిధులు, వ్యాపారులతో సమావేశం కానున్నారు. భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, మెడికల్, టెక్నాలజీ రంగాల్లో భారత్ తో పనిచేయడం గురించి ప్రకటన చేయనున్నారు బోరిస్ జాన్సన్. తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు.

భారత్ లో పర్యటించడం బ్రిటన్ ప్రధానికి ఇదే తొలిసారి. బ్రిటన్ లో ఉన్న భారతీయుల్లో ఎక్కువమంది గుజరాత్ వారే కావడంతో.. నేరుగా గుజరాత్ వచ్చారు జాన్సన్. కరోనా కారణంగా గతేడాది రెండు సార్లు పర్యటనను రద్దు చేసుకున్నారు. జనవరిలో రిపబ్లిక్ డే కోసం భారత్ ఆహ్వానించగా.. యూకేలో కరోనా విజృంభణ దృష్ట్యా బోరిస్ జాన్సన్ భారత్ రాలేకపోయారు. మళ్లీ ఏప్రిల్ లో పర్యటన ఖరారు కాగా.. భారత్ లో కరోనా కేసుల పెరుగుదలతో వీలుకాలేదు.

మరిన్ని వార్తల కోసం

బెగ్గర్స్ కోసం స్పెషల్ ఆపరేషన్

జహంగీర్పురిలో ఉద్రిక్త పరిస్థితులు