పుతిన్.. యుద్ధ నేరస్తుడు 

పుతిన్.. యుద్ధ నేరస్తుడు 

ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై  ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ దర్యాప్తునకు సిద్ధమైంది. దీనిపై  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రస్థాయిలో స్పందించారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఒక యుద్ధ నేరస్తుడని అని అన్నారు. పుతిన్ నాయకత్వంలోని రష్యా... ఉక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. అమాయక ప్రజలపై  బాంబులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దర్యాప్తునకు అన్ని బ్రిటన్ చట్టసభల సభ్యులందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారుబ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఉక్రెయిన్ లో రష్యా ముమ్మాటికీ యుద్ధ నేరాలకు పాల్పడిందని.. పుతిన్ నేరాలను అందరూ చూశారని అన్నారు. అవి కచ్చితంగా యుద్ధ నేరాలే అవుతాయని.. క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఉంటారని తెలిపారు. బ్రిటన్ రాజకీయ పక్షాలన్నీ మద్దతిస్తాయని భావిస్తున్నాను అని అన్నారు బోరిస్ జాన్సన్.

మరిన్ని వార్తల కోసం..

బెలార‌స్‌పై  ఈయూ ఆంక్ష‌లు