
త్వరలో భారత్ లో తొమ్మిది బ్రిటీష్ యూనివర్సిటీల క్యాంపస్ లు ఏర్పాటు కానున్నాయి. యూకే, భారత్ మధ్య విద్యాపరమైన సహకారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ యూనివర్సిటీల క్యాంపస్ ల ఏర్పాటు జరుగుతోంది.
ఈ విషయాన్ని భారత్ పర్యటనలో ఉన్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఇది భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మరింత సపోర్టునిస్తుందన్నారు. పరిశోధనలు, విద్యామార్పిడి ద్వారా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలపరుస్తుందన్నారు.
పర్యటనలో భాగంగా ముంబై వచ్చిన కీర్ స్టార్మర్.. స్కిల్స్ తో కూడిన హైయర్ ఎడ్యుకేషన్ కు డిమాండ్ కాబట్టి భారత్ లో తొమ్మిది బ్రిటిష్ యూనివర్సిటీల క్యాంపస్ లను ఏర్పాటు చేయడం ద్వారా భారత్ ను అంతర్జాతీయ ఉన్నత విద్యా ప్రదాతగా మారుతుందన్నారు.
బ్రిటీష్ యూనివర్సిటీ క్యాంపస్ లు ఎక్కడెక్కడంటే..
- బెంగళూరులో లాంకాస్టర్ విశ్వవిద్యాలయం క్యాంపస్...
- గుజరాత్‌లోని GIFT సిటీలో సర్రే విశ్వవిద్యాలయం..
మిగిలిన యూనివర్సిటీ క్యాంపస్ లు ఎక్కడెక్కడ స్థాపిస్తారనేది త్వరలో ప్రకటిస్తారు.