డాన్​బాస్​లో హోరాహోరీ

డాన్​బాస్​లో హోరాహోరీ
  • పట్టు సాధించేందుకు రష్యా, ఉక్రెయిన్​ పోరాటం

కీవ్ : ఉక్రెయిన్ ​తూర్పు ప్రాంతంపై రష్యా తన దాడులను తీవ్రం చేసింది. యుద్ధం మొదలై 3 నెలలు కావడంతో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో రష్యా బలగాలు ముందుకు వెళుతున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్​ సేనలు వారికి దీటుగా బదులిస్తున్నాయి. ఈ క్రమంలో డాన్​బాస్​ రీజియన్​లో ఒక ఊరి తర్వాత మరో ఊరు అన్నట్టుగా ఇరు పక్షాల మధ్యా భీకర పోరాటం సాగుతోంది. యుద్ధ తీవ్రత పెరగడంతో అక్కడి జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇల్లూవాకిలీ వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. మూడు నెలలుగా తాము అసలు సూర్యుడినే చూడలేదని, అన్ని రోజులుగా చీకటిలోనే గడపడంతో తమకు కళ్లు కనిపించని పరిస్థితి వచ్చిందని నోవోమికైల్వికా గ్రామానికి చెందిన రయిసా రిబాల్కో చెప్పింది. 
 


ఆంక్షల తీవ్రత పెంచాలి: జెలెన్ స్కీ
రష్యాపై సాధ్యమైనంత ఎక్కువగా కఠిన ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్ స్కీ కోరా రు. ముఖ్యంగా బ్యాంకులు, ఆయిల్​తో పాటు రష్యాతో అన్నిరకాల వాణిజ్య లావాదేవీలపై ఆంక్ష లు విధించాలని ప్రపంచ దేశాలను కోరారు.