అమెరికాలోని మిన్నియా పాలిస్ లో ఓ మహిళను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్చి చంపారు. మిన్నియాపాలిస్ లోని ఓల్డ్ మార్కెట్ ప్రాంతంలో కారులో వెళ్తున్న రెనీ నికోల్ గుడ్ అనే మహిళపై ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరపగా మహిళ చనిపోయిందని ICE అధికారులు చెబుతుండగా.. అమాయక మహిళను దారుణంగా కాల్చిచంపారని మిన్నియా పాలిస్ లో నిరసనలు వ్యక్తం చేశారు వలసదారులు. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక వలసలై కఠిన చట్టాలు అమలు చేస్తున్న క్రమంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటన జరిగిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు వీడియో రికార్డు చేశారు. కదులుతున్న కారును అడ్డుకుని కారుడోర్ తీసేందుకు ఓ అధికారి ప్రయత్నించారు. తర్వాత గన్ తీసి కాల్పులు జరిపినట్లు వీడియోలో రికార్డయ్యింది. కాల్పుల తర్వాత వేగంగా దూసుకెళ్లిన కారు పక్కనే ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. మహిళ కారులో చనిపోయింది.. ఘటన సమయంలో మృతురాలితోపాటు ఆమె ఆరేళ్ల బిడ్డ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోని మిన్నియా పాలిస్ లో రెనీ నికోల్ గుడ్ అనే మహిళను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్చి చంపారు. కారులో వెళ్తున్న మహిళను అడ్డుకున్న ICE అధికారులు డ్రైవింగ్ చేస్తున్న ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
ఘటన జరిగిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు వీడియో రికార్డు చేశారు. కదులుతున్న కారును అడ్డుకుని కారుడోర్ తీసేందుకు ఓ అధికారి ప్రయత్నించారు. తర్వాత గన్ తీసి కాల్పులు జరిపినట్లు వీడియోలో రికార్డయ్యింది. కాల్పుల తర్వాత వేగంగా దూసుకెళ్లిన కారు పక్కనే ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. మహిళ కారులో చనిపోయింది.. ఘటన సమయంలో మృతురాలితోపాటు ఆమె ఆరేళ్ల బిడ్డ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈఘటనతో అమెరికాలో నిరసనలకు దారితీసింది.
అయితే మిన్నియాపాలిస్‌లో 37 ఏళ్ల మహిళ రెనీ నికోల్ గుడ్‌ను కాల్చి చంపిన ICE ఏజెంట్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం చర్చనీయాంశమైంది. మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లో జరిగిన ఈ సంఘటన క్లిప్‌ను నేను చూశాను.. ఇది చాలా భయంకరమైన విషయం. ఆ మహిళ అరుస్తున్నది. ఆమె ఒక ఆందోళనకారి అని తెలుస్తోంది. కారు నడుపుతున్న మహిళ పోలీసులపై ప్రతిఘటించింది. ఉద్దేశపూర్వకంగా కారును ICE అధికారిపైకి దూసుకెళ్లింది..అతను ఆత్మరక్షణ కోసం ఆమెను కాల్చి చంపినట్లు కనిపిస్తోందని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు.
