శత్రువని తెలిసినా సాయం చేసిన్రు

శత్రువని తెలిసినా సాయం చేసిన్రు

ఉక్రెయిన్: తాను వాళ్లను చంపడానికి వచ్చిన రష్యన్ సైనికుడు. వాళ్ల దేశాన్ని సర్వనాశనం చేయడానికి పుతిన్ పంపిన సోల్జర్. అయితేనేం.. ఆకలితో ఉన్న ఆ సైనికుడికి టీ, బ్రెడ్ ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ఉక్రెయిన్లు. అంతే కాదు తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందకు ఫోన్ కూడా అందించారు. అంతిమంగా యుద్ధం కంటే మానవత్వమే గొప్పదని చాటారు ఉక్రెయిన్ ప్రజలు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉక్రెయిన్లు చేసిన ఈ పనికి నెటజన్లు ఫిదా అవుతున్నారు. ‘పుతిన్.. నువ్వు ఉక్రెయిన్ ను గెలుస్తావో లేదో తెలియదు గానీ.. ఉక్రెయిన్లు మాత్రం మీ మనస్సులను గెలిచారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

రష్యాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నిలిపేసిన శాంసంగ్