కరోనా డెడ్​బాడీ బ్యాగ్​ తెరవడంతో.. 18 మందికి వైరస్

కరోనా డెడ్​బాడీ బ్యాగ్​ తెరవడంతో.. 18 మందికి వైరస్

థానె(మహారాష్ట్ర): కరోనాతో లక్షణాలతో చనిపోయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొన్న 18 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలోని థానె ఉల్లాస్ నగర్ కు చెందిన 40 ఏళ్ల మహిళ ఈ నెల 25న చనిపోయింది. ఆమె బాడీ నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులకు పంపించిన డాక్టర్లు డెడ్​బాడీని ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. ప్యాక్ తెరవకుండా అంత్యక్రియలు ముగించాలన్న డాక్టర్ల ఆదేశాలను పట్టించుకోని కుటుంబ సభ్యులు అంతిమసంస్కారాల్లో భాగంగా ఆమె డెడ్​బాడీని ముట్టుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఆ మరుసటి రోజు వచ్చిన టెస్ట్ రిజల్ట్ లో చనిపోయిన మహిళకు కరోనా ఉన్నట్లు తేలడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న దాదాపు 100 మందికి టెస్టులు నిర్వహించారు. అందులో 18 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారందరి కాంటాక్టులు ట్రేసింగ్ పని ప్రారంభించామని ఉల్లాస్ నగర్ మున్సిపల్ కమిషనర్ మీడియాకు తెలిపారు. డాక్టర్ల సూచనలు పాటించకుండా వ్యవహరించిన వాళ్లపై కేసులు నమోదు చేస్తామన్నారు.