
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఓపెనర్ నిశాంక (72), చివర్లో కెప్టెన్ షనక పోరాడినా వరుసగా వికెట్లు కోల్పోయిన లంక ఏ దశలోనూ ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. సిరాజ్ స్టార్టింగ్‌లోనే అవిష్క ఫెర్నాండో (5), కుశాల్ మెండిస్ (0)ను ఔట్ చేసి లంకను దెబ్బకొట్టాడు. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ బుల్లెట్ల లాంటి బాల్స్‌తో లంకేయులను వణికించాడు. 14వ ఓవర్లో 156 కి.మీ వేగంతో బాల్ వేసి ఇండియా తరఫున ఫాస్టెస్ట్ బౌలర్‌గా తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. ఇదే ఓవర్లో అసలంక (23)ను ఔట్ చేయడంతో లంక 64/3తో డీలా పడ్డది. మధ్యలో నిశాంక, ధనంజయ (47) కాసేపు పోరాడారు.
అయితే, ధనంజయను షమీ, నిశాంక, వెల్లాలగె (0)ను ఉమ్రాన్ ఔట్ చేయడంతో 179/7తో నిలిచిన లంక 250 కూడా చేయడం కష్టం అనిపించింది. కానీ, కెప్టెన్ షనక చివరి ఓవర్‌దాకా క్రీజులో నిలిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ చేశాడు. కానీ, అతని పోరాటం లంక ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. కాగా, చివరి ఓవర్ నాలుగో బాల్ వేయడానికి ముందే నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో క్రీజు దాటిన షనక రనౌట్ (మన్కడింగ్) కోసం షమీ అప్పీల్ చేశాడు. కానీ, రోహిత్ కల్పించుకొని ఈ అప్పీల్ విత్‌డ్రా చేయించాడు. అప్పటికి షనక 98 రన్స్ వద్ద ఉన్నాడు.