ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వగ్రామమైన అడ గ్రామం పంచాయతీ సర్పంచ్‌గా కుర్సెంగే నిర్మల సీతారాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ తో పాటు 8 మంది వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవమయ్యారు. ఈ గ్రామ పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా సీతారాంను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, ఎమ్మెల్యే కొడుకు పాయల్ శరత్ కొత్త పాలకవర్గాన్ని సన్మానించారు.
మండలంలో తొలి ఏకగ్రీవ సర్పంచ్
కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎసన్వాయిలో కాంగ్రెస్ బలపరించిన అభ్యర్థిని ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ అభ్యర్థిగా మారుపాక రజిత ఒకేఒక్కరు నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఏకగ్రీమైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి కృషితో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి తనపై నమ్మకంతో తన పేరును కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించి తన గెలుపుకు కృషి చేసినందుకు రుణపడి ఉంటామన్నారు.
